అవినీతి సొమ్ముకు ఆశపడి జగన్‌కు మద్దతు: బాబు

2014లో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ తరపున అవినీతిపరులకు టిక్కెట్లు ఇవ్వబోమని ఆయన చెప్పారు. అవినీతికి సంబంధించి విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. అవినీతికి అండగా నిలిచి రాజీనామాలు చేసిన వారు ప్రజల్లోకి వెళ్తే ఒక్కరు కూడా గెలవరన్నారు. అవినీతిపరులకు భవిష్యత్తులో ఇదొక గుణపాఠం అవుతుందన్నారు. రాజకీయాలను అసహ్యించుకోవడం సరైన పద్ధతి కాదని, యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన కోరారు. పటిష్టమైన లోక్‌పాల్ బిల్లు కావాలని, ప్రధానిని లోక్‌పాల్ పరిధిలో చేర్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
అమెరికాలో కూడా ఎన్నికల్లో ఖర్చు పెడతారని, అయితే అది పద్ధతి ప్రకారం ఉంటుందని, అటువంటి పద్ధతి మన దేశంలోనూ రావాలని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications