జగన్ వర్గం ఎమ్మెల్యేలపై కిరణ్, బొత్స మధ్య విభేదాలు

బొత్స వ్యూహంలో భాగంగానే ప్రభుత్వ విప్ కొండ్రు మురళి స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ను కలిసి రాజీనామాలను ఆమోదించాలని కోరారు. తాము ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భేటీ అనంతరం మురళి చెప్పారు. జగన్ వర్గం శాసనసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసుకు అనుకూలంగా ఏ మాత్రం ఫలితం వచ్చినా తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు రావడానికి వీలుంటుందని బొత్స ఆలోచనగా కనిపిస్తోంది. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం ఉప ఎన్నికలకు విముఖంగా ఉన్నారు. ప్రభుత్వం ఆర్థికంగా అంత మంచి పరిస్థితిలో లేదు. ఉప ఎన్నికల్లో ప్రజలకు కొత్తగా హామీలు ఇవ్వడానికి అది సహకరించడం లేదు. దాంతో సాధ్యమైనంత వరకు రాజీనామాలను ఆమోదించకుండా జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యులను సామబేధదానదండోపాయాల ద్వారా తమ వైపు తిప్పుకోవడం మంచిదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. వీరిరువురి మధ్య విభేదాలు జగన్ వర్గం శాసనసభ్యులకు కొంత ఊరటనిస్తోంది.












Click it and Unblock the Notifications