వైయస్ జగన్ ఎమ్మెల్యేలది బ్లాక్‌మెయిల్: నారాయణ

Narayana
అదిలాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు అవినీతి కుంభకోణాల నుండి తప్పించుకోవడానికే రాజీనామాల పేరుతో బ్లాక్ మెయిలింగుకు పాల్పడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆదివారం అదిలాబాద్ జిల్లాలో విమర్శించారు. జగన వర్గం ఎమ్మెల్యేల రాజీనామాలు సరికాదన్నారు. అవినీతి నుండి తప్పించుకోవడానికి బ్లాక్ మెయిల్ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి మద్దతు పలకడం శోచనీయం అన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాయల ఫకీరు అవతారం ఎత్తి లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారా అని ప్రశ్నించారు. సిఎం లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పడం సరికాదన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభం అయిందని దానిని ఎవరూ ఆపలేరన్నారు. జిల్లాలోని శ్రీరాంపూర్ గ్రామంలోని పార్టీ కార్యకర్తల సమావేశంలో నారాయణ ఆదివారం పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+