స్పీకర్ చుట్టూ తిరుగుతున్న రాష్ట్ర రాజకీయాలు

గత నెల నాలుగో తారీఖున తెలంగాణ కోసం అంటూ తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పార్టీలకతీతంగా 101 మంది రాజీనామా చేశారు. అప్పుడు స్పీకర్ అమెరికా పర్యటనలో ఉండటంతో ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ కార్యదర్శికి తమ రాజీనామాలు సమర్పించారు. అమెరికా పర్యటన నుండి వచ్చిన నాదెండ్ల మనోహర్ వాటిని ఒక్క సంతకంతో రిజక్ట్ చేశారు. ఆ తర్వాత జగన్ ఆస్తుల కేసులో సిబిఐ ఎఫ్ఐఆర్‌లో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావించిందంటూ జగన్ వర్గం ఎమ్మెల్యేలు 26 మంది రాజీనామాలు చేశారు.
తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల రాజీనామాలు రిజక్ట్ చేసిన తర్వాత వారంతా మిన్నకుండినప్పటికీ తెలుగుదేశం పార్టీ బహిష్కృత శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి బృందం మాత్రం మరోసారి రాజీనామాలు సమర్పించింది. వారు తమ రాజీనామాలు ఆమోదించాలని కోరుతూ నిత్యం అసెంబ్లీ చూట్టూ తిరుగుతున్నారు. పలుమార్లు స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలంటూ విజ్ఞప్తి చేశారు. జగన్ వర్గం రాజీనామాలు ఆమోదిస్తే తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులు మరోసారి రాజీనామాలు చేసి ఆమోదించాలంటూ ఒత్తిడి తెచ్చే అవకాశాలూ ఉన్నాయి. ఇలా గత కొంతకాలంగా గతంలో ఎన్నడూ లేని విధంగా స్పీకర్ చుట్టూనే రాజకీయాలు తిరగడం విశేషం.












Click it and Unblock the Notifications