బాబులా జగన్ కండువాలు మార్చరు: శోభ, బాలినేని

Shobha Nagi Reddy-Balineni Srinivas Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిలా కండువాలు మార్చే సంస్కృతి తమ పార్టీ నాయకుడు వైయస్ జగన్మోహ్ రెడ్డిది కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు శోభా నాగిరెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. బిజెపితో వైయస్ జగన్ పొత్తు పెట్టుకుంటారనే వార్తలను వారు సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. జాతీయ స్థాయిలో బిజెపితో పొత్తు ఉండదని జగన్ ఇప్పటికే స్పష్టం చేశారని వారు గుర్తు చేశారు.

సిబిఐని కాంగ్రెసు దుర్వినియోగం చేస్తున్నారని పార్లమెంటులో సుష్మా స్వరాజ్ అంటూ జగన్ అంశాన్ని ఉదహరించారని వారు చెప్పారు. రాజీనామాలకు తామంతా కట్టుబడి ఉన్నామని వారు చెప్పారు. తమ రాజీనామాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ తీసుకునే నిర్ణయంపై తమ భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉంటుందని వారన్నారు. వచ్చే నెల 2వ తేదీన వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా సమావేశమైన కార్యాచరణను రూపొందించుకోనున్నట్లు వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+