చంద్రబాబు లేఖ ఇస్తే తెలంగాణకు పరిష్కారం: గుత్తా

Gutta Sukender Reddy
హైదరాబాద్: గతంలో చేసిన తీర్మానం మేరకు తెలంగాణకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లేఖ ఇస్తే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుందని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అవసరమైతే తమ పార్టీ శాసనసభ్యులు మళ్లీ రాజీనామాలు చేస్తారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాము రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై తెలుగుదేశం నేతల చిత్తశుద్ధిని తాము శంకించడం లేదని ఆయన అన్నారు.

తెలంగాణ ఐక్య వేదిక ఏర్పాటు కూడా అవసరమని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్టీరింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణపై తమ భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకుంటామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధన కోసం చేస్తున్న సకల జనుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. సకల జనుల సమ్మె సందర్భంగా విధులకు హాజరయ్యే ఉద్యోగుల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై కూడా స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+