రాజీనామాలు చేద్దాం: జానా రెడ్డితో టిటిడిపి నేతలు

కాంగ్రెసు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శానససభ్యులు మాత్రం మళ్లీ రాజీనామాలు చేయలేదు. అందరం కలిసి రాజీనామాలు చేస్తేనే రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని, అలాంటి పరిస్థితి వస్తేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమవుతుందని తెలుగుదేశం తెలంగాణ ఫోరం నాయకులు జానా రెడ్డితో చెప్పారు. తమ పార్టీకి చెందిన శాసనసభ్యులు మాత్రమే రాజీనామాలు చేయడం వల్ల ఉప ఎన్నికలు మాత్రమే వస్తాయని, దానివల్ల ఫలితం ఉండదని వారన్నారు. రాజీనామాల వల్ల ఎన్నికలు వస్తే పార్టీ జెండాలను పక్కన పెట్టి కామన్ సింబల్‌పై పోటీ చేద్దామని కూడా వారు సూచించారు.












Click it and Unblock the Notifications