వైయస్‌పై బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మెసెంజర్ ద్వారా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు పార్టీకి రాజీనామా చేస్తూ మెసెంజర్ ద్వారా లేఖలు పంపిస్తే ఎలా ఆమోదించేదని ఆయన అడిగారు. వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తాను అధిష్టానానికి ఏ విధమైన లేఖ రాయలేదని ఆయన స్పష్టం చేశారు. ఒకటిరెండు రోజుల్లో తన ఆస్తుల వివరాలు వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. చిరంజీవితో కలిసి తన జిల్లా పర్యటనలుంటాయని, ఆ వివరాలు రేపు వెల్లడిస్తానని ఆయన అన్నారు.
పార్టీ, ప్రభుత్వం పట్ల బాధ్యత పెరిగేలా తన తూర్పు గోదావరి జిల్లా పర్యటన సాగిందని ఆయన చెప్పారు. పార్టీ కార్యకర్తల మధ్య అక్కడక్కకడా సమన్వయ లోపం కనిపించిందని ఆయన అన్నారు. కార్యకర్తల్లో మనోధైర్యం నింపాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలతో కాంగ్రెసు కార్యకర్తల సమన్వయం సాధించాల్సి ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications