వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలకు చిరంజీవి సూచన

కాంగ్రెసులో తన స్థానమేమిటో ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. తాను పదవులకు ఆశపడడం లేదని ఆయన చెప్పారు. కాంగ్రెసు, ప్రజారాజ్యం పార్టీల కార్యకర్తల మధ్య సమన్వయానికి వచ్చే నెలలో జిల్లాల్లో పర్యటించనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే తన జన్మదినం నాటికి తన 150వ సినిమా ప్రజల ముందుకు వస్తుందని ఆయన అన్నారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని తాను వినాయకుడిని కోరినట్లు ఆయన తెలిపారు. రైతులకు మేలు జరగాలని వేడుకున్నట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications