చెప్పులతో కాణిపాకం ఆలయంలోకి గల్లా అరుణకుమారి

వినాయక చవితి సందర్భంగా ఆమె గురువారం ఉదయం వరసిద్ధి వినాయకుడికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆమె వెంట తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పాలక మండలి చైర్మన్ కనమూరి బాపిరాజు, దేవాదాయ కమిషనర్ బలరామయ్య, ఇతర ఆలయ అధికారులు ఉన్నారు. ఆలయ సంప్రదాయాన్ని మంత్రి మంట గలిపారని భక్తులు మండిపడ్డారు.తాను కావాలని చేయలేదని, ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లనే చెప్పులు వేసుకోవాల్సి వచ్చిందని గల్లా అరుణకుమారి అన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ విషయాన్ని వివాదం చేయవద్దని ఆమె మీడియాను వేడుకున్నారు.












Click it and Unblock the Notifications