వైయస్ జగన్‌తో కెసిఆర్ కుమ్మక్కు: మోత్కుపల్లి

రాజీనామాలు చేయకపోతే చస్తారా అని కెసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. కెసిఆర్ చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తెలుదుశం మరో తెలంగాణ ప్రాంత శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డితో కలిసి అన్నారు. రాజీనామాలు చేసిన తర్వాత తెలంగాణ వచ్చేవరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదనేది తమ ఏకైక డిమాండ్ అని, దాన్ని అంగీకరించే దమ్ము కెసిఆర్‌కు ఉందా అని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే చస్తారా అని ఆయన అడిగారు. ఉప ఎన్నికలు వస్తే మళ్లీ పోటీ చేయడం వల్ల ఫలితం ఉండదని అందరికీ తెలుసునని ఆయన అన్నారు. తెరాస వల్లనే 600 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications