వికీలీక్స్: కెసిఆర్‌కు సరెండర్, కాంగ్రెసు బలహీనత

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబర్ చేసిన ప్రకటన తొందరపాటుతో కూడిందని, దాని వల్ల కాంగ్రెసు పార్టీలోనే చీలిక వచ్చిందని రీమోర్స్ తన సమాచారాన్ని పంపినట్లు వికీలీక్స్ తెలిపింది. కాంగ్రెసు బోల్తా కొట్టించవచ్చునని ఎన్నికల్లో విజయం సాధించిన ఆరు నెలల్లోనే కాంగ్రెసు బయటపెట్టుకుందని రిమోర్స్ వ్యాఖ్యానించినట్లు తెలిపింది. శాసనసభలో ఆరుగురు సభ్యులు, పార్లమెంటులో ఇద్దరు సభ్యులు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి, ఆ పార్టీ అధ్యక్షుడు కెసిఆర్‌కు చిదంబరం ప్రకటన గొప్ప విజయాన్ని సాధించి పెట్టిందని రీమోర్స్ వ్యాఖ్యానించినట్లు వికీలీక్స్ తెలిపింది. హైదరాబాదు లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అంగీకరించబోమని తెరాస అంటోందని, అయితే హైదరాబాదులో ఫార్మాస్యూటికల్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలు వెలిశాయని, అవన్నీ తెలంగాణేతర రెడ్డి, కమ్మ సామాజిక వర్గాల చేతుల్లో ఉన్నాయని కూడా రిమోర్స్ చెప్పినట్లు వికీలీక్స్ వెల్లడించింది.












Click it and Unblock the Notifications