గాలి ఇంట్లో రూ. 3కోట్లు, 30 కిలోల బంగారం గుర్తింపు

గాలి జనార్దన్ రెడ్డి భార్య అరుణ లక్ష్మిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. జనార్దన్ రెడ్డిని నివాసంలోని ప్రత్యేక గది తాళం పగులగొట్టి సోదాలు చేశారు. గాలి జనార్దన్ రెడ్డి నివాసంలో సిబిఐ అధికారులు నాలుగు పుస్తకాలు, ల్యాప్‌ట్యాప్, డైరీ స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి హెలికాప్టర్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి సోదరులు గాలి కరుణాకర్ రెడ్డి, గాలి సోమశేఖర రెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు శ్రీరాములు నివాసాల్లో కూడా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో మరింత మందిని సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. వీరిలో అధికారులు కూడా ఉండవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications