గాలి జనార్దన్ రెడ్డి, వైయస్ జగన్‌లకు బిజెపి దూరమే

కర్ణాటక వ్యవహారాలే గాలి జనార్దన్ రెడ్డి కొంప ముంచినట్లు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి సదానంద గౌడ ప్రభుత్వాన్ని కూల్చడానికి గాలి జనార్దన్ రెడ్డి కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో అరెస్టు జరిగింది. గాలిని అరెస్టు చేయడం ద్వారా సీబీఐ ఒక రకంగా కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడినట్లయిందని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. కాగా అదే సమయంలో జగన్‌కు మద్దతు ఇచ్చే విషయంలో కూడా బీజేపీ వెనక్కు తగ్గినట్లు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. సిబిఐ పనితీరును విమర్శించినంత మాత్రాన జగన్‌ను సమర్థించడం కాదని బిజెపి నాయకులు తమ మాటలకు అర్థాలు మార్చేస్తున్నారు.
అవినీతి శక్తులతో కుమ్మక్కు కావడాన్ని అద్వానీ సహించబోరని, నిజానికి యడ్యూరప్పను ఎప్పుడో తొలగించవలిసిందిగా అద్వానీ చెప్పినప్పటికీ ఆలస్యం జరిగిందని బీజేపీ వర్గాలు తెలిపాయి. గాలి విషయంలో కాని, జగన్ విషయంలో కాని చట్టాన్ని తన పని తాను చేసుకోనివ్వాలని, మనం కలుగ చేసుకోకూడదని సోమవారం జరిగిన బీజేపీ అగ్రనేతల సమావేశం కూడా అని ముక్తకంఠంతో అభిప్రాయపడినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications