గాలి అరెస్టు: చిక్కుల్లో సబితా ఇంద్రా రెడ్డి, బాలినేని

Sabitha Indra Reddy-Balineni Srinivas Reddy
హైదరాబాద్: అక్రమ మైనింగ్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అరెస్టుతో గనుల శాఖలను నిర్వహించిన మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి చిక్కుల్లో పడ్డారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే గాలి జనార్దన్ రెడ్డి రెచ్చిపోయారు. వైయస్‌ను తన తండ్రిగా ఆయన చెప్పుకునేవారు. వైయస్ హయాంలో రాష్ట్రంలోని గనులను ఇష్టారాజ్యంగా అప్పగించారు. గనుల కేటాయింపుపై కూడా సిబిఐ దృష్టి సారించింది. తనకు సమీప బంధువు కావడం వల్లనే ఏ విధమైన ఆటంకాలు లేకుండా గనుల సంపదను దోచి పెట్టేందుకే వైయస్ రాజశేఖర రెడ్డి గనుల శాఖను బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించారనే విమర్శలు కూడా వచ్చాయి. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారాలతో సబితా ఇంద్రారెడ్డికి, బాలినేని శ్రీనివాస రెడ్డికి సంబంధాలున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గనుల కేటాయింపులో సబితా ఇంద్రా రెడ్డి కూడా కీలక పాత్ర పోషించినట్లు చెబుతారు. గాలితో పాటు సబితా ఇంద్రా రెడ్డిని కూడా అరెస్టు చేయాలని తెలుగుదేశం తిరుగుబాటు శాసససభ్యుడు హరీశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి గనుల శాఖ డైరెక్టర్ రాజగోపాల్, అప్పటి గనుల శాఖ ముఖ్యకార్యదర్సి శ్రీలక్ష్మి వంటి అధికారులు కూడా చిక్కుల్లో పడే అవకాశాలున్నాయి. రాజగోపాల్‌ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వైయస్ హయాంలో తీవ్రంగా దుయ్యబట్టారు. ఆధారాలను కూడా చూపారు. అయినా పట్టించుకోలేదు. శ్రీలక్ష్మి కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. రోశయ్య ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత శ్రీలక్ష్మిని గనుల శాఖ నుంచి మార్చి కుటుంబ సంక్షేమానికి పంపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+