జైలుకెళితే దేవుడే చూసుకుంటాడు: వైయస్ జగన్

ఎన్నికలకు ముందు గానీ ఎన్నికల తర్వాత గానీ బిజెపితో కలిసే ప్రసక్తి లేదన్నారు. తాను రాత్రికి రాత్రే కోటీశ్వరున్ని కాలేదన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో తనకు, తన తండ్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తన తండ్రి ఎన్నికల్లో గాలికి వ్యతిరేకంగా ప్రచారం చేశారన్నారు. గాలికి మైనింగ్ అనుమతులు పొడిగించింది తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడే అన్నారు. చంద్రబాబు ప్రవేశ పెట్టిన వాటినే తన తండ్రి అమలు పరిచారని చెప్పారు. అలాంటప్పుడు తన తండ్రిని మాత్రమే తప్పు పట్టడం ఎంత వరకు సమంజసమన్నారు.












Click it and Unblock the Notifications