వైయస్ జగన్ వర్గానికి ఫోన్ ట్యాపింగ్ బెడద?

తమ వ్యూహాలను పసిగట్టడానికి ప్రభుత్వమే ఫోన్ ట్యాపింగ్‌కు ఆదేశించినట్లు జగన్ వర్గం శాసనసభ్యులు ఆరోపిస్తున్నారు. జగన్ వైపు వెళ్లిన కొంత మంది శాసనసభ్యులు వెనక్కి వస్తారనే ప్రచారాన్ని కాంగ్రెసు వర్గాలు ఒక వైపు ప్రచారంలో పెట్టగా, తమ వైపు మరింత శాసనసభ్యులు వస్తారని జగన్ వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. ఎటు నుంచి ఎటు శాసనసభ్యులు వెళ్తారు, జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుల్లో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారు అనే విషయాలను పసిగట్టడానికి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కారణంగానే జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి విశాఖపట్నం నుంచి విమానంలో హైదరాబాదు వచ్చి జగన్‌ను కలిసి మళ్లీ విమానంలో వెళ్లిపోయారు. ఏ విషయమైనా సరే, ముఖాముఖి మాట్లాడుకోవడమే మంచిదని, ఫోన్‌లో మాట్లాడకూడదని జగన్ వర్గం ఓ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications