నాగం జగన్ ఏజెంట్ కాబట్టి బహిష్కరించాం: ఎర్రబెల్లి

Errabelli Dayakar Rao
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నాయకుడు, నాగర్ కర్నూల్ శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏజెంట్ అయినందు వల్లనే పార్టీ నుండి బహిష్కరించామని టిడిపి సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు బుధవారం మహబూబ్ నగర్ జిల్లాలో అన్నారు. స్వార్థం కోసమే నాగం జనార్ధన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం చేస్తున్నారన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమానికి నాగం జనార్ధన్ రెడ్డియే అడ్డుపడ్డారని ఆరోపించారు.

తెలంగాణ పట్ల తెలంగాణ రాష్ట్ర సమితికి చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులతో రౌండ్ టేబులు సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో అందరూ పోరాటానికి సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు. అందరూ తమ తమ జెండాలు వదిలి ముందుకు వస్తేనే తెలంగాణ సాధ్యమన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఎవరూ ఎన్నికల్లో పాల్గొనవద్దని సూచించారు. రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయడం త్యాగం ఎలా అవుతుందని ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+