చంద్రబాబుకు షాక్, జారిపోయిన ఆరుగురు ఎమ్మెల్యేలు

Chandrababu Naidu
హైదరాబాద్: ఊహించిన పరిణామమే అయినప్పటికీ తెలంగాణకు చెందిన నలుగురు శాసనసభ్యులు పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఎదురు దెబ్బనే. దీంతో ఆరుగురు తెలుగుదేశం శాసనసభ్యులు ఆరుగురు పార్టీకి దూరమైనట్లు అయింది. సీమాంధ్రకు చెందిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, బాలనాగిరెడ్డి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి వెళ్లిపోయినట్లే. వారిద్దరిపై అనర్హత వేటుకు తెలుగుదేశం పార్టీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ఫిర్యాదు చేసింది. దానిపై నిర్ణయం పెండింగులో ఉండగానే వారిద్దరు జగన్‌కు మద్దతుగా శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు.

కాగా, తెలంగాణపై చంద్రబాబు వైఖరిని నిరసిస్తూ తెలంగాణకు చెందిన నాగం జనార్దన్ రెడ్డి, వేణుగోపాలాచారి, హరీశ్వర్ రెడ్డి, జోగు రామన్న పార్టీ సభ్యత్వాలకు బుధవారం రాజీనామాలు చేశారు. తెలంగాణ కోసం వారు ఇది వరకే శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. ఆ రాజీనామాలు పెండింగులో ఉన్నాయి. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆరుగురు శాసనసభ్యులు జారిపోవడం చంద్రబాబుకు ఇబ్బంది కలిగించే విషయమే. కాగా, ఈ నెల 9వ తేదీన జరిగే ఉద్యమ వేదిక మీది నుంచి తమ భవిష్యత్తు కార్యక్రమాన్ని ప్రకటిస్తామని నాగం జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+