రష్యాలో విమానం కూలి 43 మంది దుర్మరణం

యారోస్లావీ సమీపంలోని విమానాశ్రయం నుంచి బయలుదేరిన వెంటనే యాక్ - 42 విమానం కుప్పకూలిందని రష్యా అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానంలో మొత్తం 45 మంది ఉన్నారు. వారిలో 8 మంది విమాన సిబ్బంది. సమాచారం అందిన వెంటనే రష్యా ప్రధాని వ్లదిమీర్ పుతిన్ జాతీయ రవాణా మంత్రిని సంఘటనా స్థలానికి పంపించారు. విమానంలో లోకోమోటివ్ ఐస్ హాకీ టీమ్ యరోస్వాలి నుంచి మిన్‌స్క్‌కు బయలుదేరినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కాంటినెంటల్ హాకీ లీగ్‌లో పాల్గొనడానికి వారంతా బయలుదేరారు.












Click it and Unblock the Notifications