మాజీ సిపి అమ్మాయిల్ని వేధించాడు: సాక్ష్యాలతో వంశీ

Vallabhaneni Vamsi
హైదరాబాద్: విజయవాడ మాజీ పోలీసు కమిషనర్ సీతారామాంజనేయులు అమ్మాయిలను వేధించిన కేసులో విజయవాడ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వల్లభనేని వంశీ ప్రత్యేకాధికారి ముందు బుధవారం హాజరయ్యారు. ముందు ప్రత్యేకాధికారి ముందు హాజరైన వల్లభనేని ఆ తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) కార్యాలయానికి వెళ్లారు. నాటి సిపి సీతారామాంజనేయులు అమ్మాయిలను వేధించాడని చెబుతూ అందుకు సంబంధించిన సాక్ష్యాలను సమర్పించారు. వల్లభనేని ప్రత్యేక అధికారి దుర్గా ప్రసాద్ ముందు హాజరయ్యారు.

అనంతరం వల్లభనేని మాట్లాడుతూ సీతారామాంజనేయులు అమ్మాయిలను వేధించారన్నారు. ఇక్కడ న్యాయం జరగక పోతే తాను సుప్రీం కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా గతంలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పని చేసిన సీతారామాంజనేయులు అమ్మాయిలకు, మహిళలకు అసభ్యకర ఎస్సెమ్మెస్‌లు పంపి వేధించారనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అమ్మాయిలను వేధించారన్న ఆరోపణలు రావటంతో సీతారామాంజనేయులును విజయవాడ నుండి బదిలీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+