హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సబ్బం హరి రాజీనామా ఆలస్యం అందుకేనా?

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sabbam Hari
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి మొదటి నుండి గట్టి మద్దతుదారుడుగా ఉంటూ వస్తున్న సబ్బం హరి తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయక పోవడానికి తన భార్యకు అమెరికాలో చేయించాల్సిన చికిత్సనే కారణం అని తెలుస్తోంది. జగన్‌కు మద్దతుగా ఇప్పటికే ఇరవయ్యారు మంది శాసనసభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. మరో ఇద్దరు పార్లమెంటు సభ్యులు కూడా రాజీనామా చేస్తారని అప్పుడే ప్రకటించారు. అందులో ఒకరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, రెండోవారు సబ్బం హరి. అయితే ఇటీవలే మేకపాటి తన రాజీనామా పత్రాన్ని స్పీకర్ మీరాకుమార్‌కు అందించారు. అప్పుడే సబ్బం హరి మరి కొన్ని రోజుల్లో తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు.

ఆయన ఈ నెల 7వ తారీఖున రాజీనామా చేయవచ్చుననే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఆయన బుధవారం సైతం రాజీనామా చేసే అవకాశం కనిపించడం లేదు. ఆయన మేకపాటితో కలిసి గానీ, ఇప్పుడు గానీ రాజీనామా చేయక పోవడానికి ఆయన భార్యకు అమెరికాలో చికిత్స జరిపించడం కోసమే అని తెలుస్తోంది. చికిత్స కోసం అమెరికా వెళ్లాల్సిన సమయంలో రాజీనామా చేస్తే ఎంపీగా ప్రభుత్వం ఇచ్చిన డిప్లమేట్ పాస్‌పోర్టు, వీసా వెనక్కి తిరిగి ఇచ్చి వేయాల్సి ఉంటుంది. అందుకే చికిత్స అనంతరం భారత్ వచ్చిన తర్వాతే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి నిర్ణయించుకునే అవకాశాన్నీ కొట్టి పారేయలేం.

English summary
It seems, Anakapalli MP Sabbam Hari is delaying his resignation for his wife operation in America.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X