హరీష్ రావుపై ధ్వజమెత్తిన ఎర్రబెల్లి దయాకర రావు

సిద్దిపేట తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుడు హరీష్ రావు ఓ బచ్చా అని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి గురువారం విమర్శించారు. ఉద్యమం పేరుతో అదిలాబాద్ జిల్లాలో బినామీ పేరుతో రూ.400 కోట్ల రోడ్డు కాంట్రాక్టు హరీష్ రావు చేపట్ట లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగ సంక్షోభం ద్వారానే తెలంగాణ సాధ్యమని తెలుగుదేశం ఎప్పటి నుండో చెబుతోందన్నారు. రాజీనామాలు చేస్తే పోటీకి దూరంగా ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ప్రకటించిందన్నారు. తెలంగాణ కోసం అంటూ రాజీనామా చేసిన బాన్సువాడ మాజీ శాసనసభ్యుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పోటీలో నిలవకుండా ఆదర్శంగా నిలవాలని సూచించారు.












Click it and Unblock the Notifications