వైయస్‌తో జగన్ వేరు, నమ్మిన ఎమ్మెల్యేల్లో కలవరం

YS Jagan
హైదరాబాద్: కర్నాటక మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ శాసనసభ్యుడు గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు తర్వాత ఆయనపై వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వర్గం శాసనసభ్యులలో కలవరం కలిగిస్తున్నట్లుగా కనిపిస్తోంది. గాలి జనార్ధన్ రెడ్డి అరెస్టు అయ్యాక ఢిల్లీలో ఉన్న జగన్‌ను మీడియా అరెస్టుపై స్పందించాల్సిందిగా కోరింది. దీనికి జగన్ గాలితో తనకేమి సంబంధమని, ఆయన గురించి అడగాల్సి వస్తే కర్నాటక ప్రజలను, భారతీయ జనతా పార్టీని అడగాలి. కానీ తనను అడగటమేమిటని ఇది సరికాదని మీరు కనీస విలువలు పాటించాలంటూ మీడియాకు హితబోధ చేశారు. గాలి జనార్ధన్ రెడ్డితో జగన్ సంబంధాలు బహిర్గతమే. వైయస్ మృతి తర్వాత వైయస్ తన తండ్రి వంటి వాడని, జగన్ తన తమ్ముడని గాలి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

అంతేకాకుండా ఇరువురి మధ్య వ్యాపార లావాదేవీలు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసునని అలాంటప్పుడు గాలితో తనకేమి సంబంధం అని జగన్ చెప్పడం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకు వెళుతుందని జగన్ వర్గం ఎమ్మెల్యేలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా దివంగత వైయస్ తనను నమ్మిన వారి కోసం తాను నష్టపోతానని తెలిసినప్పటికీ వారికి అండగా ఉండేవాడని కానీ జగన్ మాత్రం తండ్రి వైఖరికి పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాడనే అంతర్మథనం జగన్ ఎమ్మెల్యేల్లో ఉన్నట్లుగా సమాచారం. గాలి వంటి వ్యక్తితోనే తనకు ఎలాంటి సంబంధం లేదని తేలిగ్గా తేల్చిన జగన్ ముందు ముందు తమపట్ల కూడా అలాగే వ్యవహరించే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఆవేదన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.

మాట తప్పని మడమ తిప్పని వంశం అంటూ గాలితో సంబంధాలను ఒక్క మాటతో కొట్టి పారేశారని అలాంటప్పుడు రాష్ట్ర ప్రజలు ఆయనను ఎలా నమ్మగలరనే ప్రశ్న వారిలో ఉదయించినట్లుగా సమాచారం. తనను నమ్ముకున్న వారిని కాపాడటంలో వైయస్ తీరుకు జగన్ పూర్తి భిన్నంగా ఉండటంతో జగన్ వర్గం ఎమ్మెల్యేల్లో కలవరం కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరవయ్యారు మంది రాజీనామాలపై స్పీకర్ నాదెండ్ల మనోహర్ వ్యక్తిగతంగా కలిసి విచారణ జరుపుతారనే సమయంలో జగన్ గాలితో తనకు సంబంధం లేదని చేసిన వ్యాఖ్యలు ఆయనకు నష్టం కలిగించే అవకాశాలను కొట్టి పారేయలేమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+