ముద్దుబిడ్డ డైలీ సీరియల్‌పై హెచ్‌ఆర్‌సికి ఫిర్యాదు

ముద్దుబిడ్డ తెలుగు సీరియల్ ప్రతి రాత్రి ఎనిమిది గంటలకు ప్రసారమవుతోంది. ఓ పాప ఓ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు కుట్రపూరితంగా వ్యవహరించే ఇతివృత్తంతో ఈ సీరియల్ నిర్మితమైంది. ఓ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఓ మహిళ తన బిడ్డకు శిక్షణ ఇచ్చి ఆ కుటుంబ సభ్యుల బిడ్డగా ఆ కుటుంబంలోకి ప్రవేశపెడుతుంది. కుట్రలు, కుతంత్రాలు చేసే పిల్ల వయస్సు చాలా చిన్నగా ఉంది. నిజానికి, ఆ పాత్ర వయస్సు అంతగా కుట్రలు, కుతంత్రాలు చేసేది కూడా కాదని సీరియల్ చూస్తే అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications