అమర్ నోరు తెరిస్తే చాలా మందికి తిప్పలే: జయప్రద

విశ్వాస పరీక్ష సందర్భంగా జరిగిన ఓటుకు నోటు స్కామ్ ద్వారా ప్రయోజనం పొందినవారు వేరే ఉన్నారని, అమర్ సింగ్‌కు ఏ విధమైన ప్రయోజనం చేకూరలేదని, అటువంటప్పుడు అమర్ సింగ్ ఎందుకు జైలులో ఉండాలని ఆమె అన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం దాడి చేస్తున్నా అమర్ సింగ్ మౌనంగా ఉన్నారని, అమర్ సింగ్ నోరు తెరిస్తే చాలా మంది ఇబ్బందుల్లో పడుతారని, మాటకు కట్టుబడడం వల్లనే మాట్లాడడం లేదని, అది అమర్ సింగ్ వ్యక్తిత్వమని ఆమె అన్నారు. అమితాబ్ బచ్చన్ కూడా అమర్ సింగ్ పక్కన నిలబడకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. మాయావతి ప్రభుత్వాన్ని పడగొట్టి ములాయం సింగ్‌ను అమర్ సింగ్ ముఖ్యమంత్రిని చేశారని జయప్రద అన్నారు. అమర్ సింగ్ ద్వారా ప్రయోజనం పొందిన పలువురి పేర్లను ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications