శాడిస్టు భర్త: సైంటిస్ట్‌కూ తప్పని వేధింపులు

అదనపు కట్నం కోసం బాగా హింసించే వారన్నారు. తన భర్త తరఫు కుటుంబమంతా పెద్ద శాడిస్టు కుటుంబమని ఆరోపించించింది. తనను ఎప్పుడు ఓ కోడలిలా కనీసం మనిషిలా ట్రీట్ చేయలేదన్నారు. తాను ఢిల్లీలో పని చేస్తుండగా అప్పుడప్పుడు వచ్చి తన జీతం మొత్తాన్ని తీసుకు వెళ్లే వారని చెప్పారు. తన భర్త నిత్యం ఇష్టం లేని పెళ్లి చేసుకున్నానని, కేవలం డబ్బు చూసే పెళ్లి చేసుకున్నానని నిత్యం తనను వేధించే వాడని చెప్పారు. ఇటీవల తన క్యారెక్టర్ పైనా నిందలు వేయడం ప్రారంభించారన్నారు. తన భవిష్యత్తును దెబ్బతీయాలని చూస్తున్నారన్నారు. తనను వదిలించుకొని ఎక్కువ కట్నం ఇచ్చే మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నారన్నారు. తనలా మరో అమ్మాయి బలి కాకూడదనే తాను మీడియా ముందుకు వచ్చానన్నారు.












Click it and Unblock the Notifications