జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉండు: జగన్‌కు దేవినేని

వైయస్ జగన్‌కు తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు లేదని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అవినీతిపరులకు ఓటింగ్ పెడితే జగన్ మొదటి స్థానంలో ఉంటారన్నారు. కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఉరిశిక్ష వేయాలన్నారు. రాష్ట్ర కాంగ్రెసు నేతలు ప్రజా సేవ చేయకుండా ఏం తింటున్నారో ఏడేళ్లుగా టిడిపి చెబుతూనే ఉందని మరో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. జగన్ కాంగ్రెసులో ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. 33 మంది ఎంపీలలో ఒకడిగా ఉన్నప్పుడు రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. పార్టీ పెట్టిన తర్వాత ప్రశ్నలు వేయడం కాదన్నారు.












Click it and Unblock the Notifications