కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కెసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నం, అడ్డుకున్న స్త్రీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
కరీంనగర్/మహబూబ్ నగర్: కాంగ్రెసు కార్యకర్తలు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మను దగ్ధం చేయడానికి ప్రయత్నించడం కరీంనగర్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. మంత్రి శ్రీధర్ బాబుపై కెసిఆర్ చేసిన విమర్శలకు నిరసనగా కాంగ్రెసు పార్టీ కార్యకర్తలు కెసిఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాకు చేరుకున్నారు. అయితే ఆ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ మహిళా కార్యకర్తలు అక్కడకు వచ్చి దిష్టిబొమ్మ దగ్ధాన్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఓ టిఆర్ఎస్ కార్యకర్త కేసిఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ దిష్టిబొమ్మను తీసుకొని దూరంగా పరుగెత్తాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల జోక్యం కారణంగా పరిస్థితి అదుపులోకి వచ్చింది.

మహబూబ్ నగర్ జిల్లాలోను స్థానిక ప్రజలు పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావును ఘెరావ్ చేశారు. రాజీనామాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ తెలంగాణ కోసం అందరూ రాజీనామా చేయాలని పిలుపునిచ్చారు. కాగా తెలంగాణలోని సకల జనుల సమ్మెలో తాము కూడా పాల్గొంటామని తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం హెచ్చరించింది. తాము సమ్మెలో పాల్గొంటే అంతా అంధకారంలో ఉంటుందన్నారు. ఈ నెల 19 నుండి అత్యవసర సేవలు మినహా సమ్మెలో పాల్గొంటామని చెప్పారు. సుమారు 25వేల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొననున్నారని తెలుస్తోంది.

English summary
TRS activist run with TRS chief K Chandrasekhar Rao's effigy to obstruct fire by Congress activists.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X