కొండా సురేఖ, సత్యవతి రాజీనామా, జయసుధ టోకరా

కాగా సకల జనుల సమ్మెకు మద్దతుగా జగన్ వర్గం తెలంగాణ ప్రజా ప్రతినిధులు జయసుధ, కొండా సురేఖ, కుంజా సత్యవతి రాజీనామాలు చేస్తారన్న వాదనలు వినవచ్చిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం మాత్రం జయసుధ తాను ప్రస్తుతం ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేసే ప్రసక్తి లేదని చెప్పిన విషయం తెలిసిందే. రాజీనామాల వ్యవహారం ఓ డ్రామాలాగ కనిపిస్తోందని, రాజీనామాలు ఆమోదిస్తారనే విశ్వాసం ఏర్పడినప్పుడే చేస్తానని చెప్పారు. రాజీనామాపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. తాను అందరిలాంటి రాజకీయ నాయకురాలిని కాదని చెప్పారు. కాగా గతంలో తెలంగాణ కోసం మిగిలిన ఎమ్మెల్యేలతో పాటు వీరు కూడా రాజీనామా చేశారు. అయితే వాటిని స్పీకర్ మూకుమ్మడిగా తిరస్కరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications