కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గాలి భూముల్లో ఎర్రజెండాలు పాతిన స్థానికులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gali Janardhan Reddy
కర్నూలు: అక్రమ మైనింగ్ కేసులో అరెస్టయిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి భూముల్లో స్థానికులు ఎర్ర జెండాలు పాతారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ గ్రామంలోని 70 ఎకరాల భూముల్లో వారు ఈ ఎర్ర జెండాలు పాతారు. సిపిఐ, సిపిఎం ఆధ్వర్యంలో స్థానికులు ఆ భూములపై దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఆ భూములు గాలి జనార్దన్ రెడ్డి సతీమణి అరుణ పేరు మీద ఉన్నట్లు తెలుస్తోంది.

గాలి జనార్దన్ రెడ్డి దాదాపు 70 ఎకరాల భూమిని కొనుగోలు చేసి తన భార్య పేరు మీద రిజిష్టర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ భూముల్లోని పది ఎకరాల్లో ప్రస్తుతం మామిడి తోటలు ఉన్నట్లు కూడా చెబుతున్నారు. గతంలో తమ వద్ద తక్కువ ధరకు గాలి జనార్దన్ రెడ్డి భూములను తీసుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

English summary
Locals with the support of CPI and CPM seized Gali Janardhan Reddy's lands in Kurnool district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X