హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రఘువీరాకు సమ్మె దెబ్బ, కలెక్టర్ల కోసం నిరీక్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghuveera Reddy
హైదరాబాద్: మంత్రి రఘువీరా రెడ్డికి సకల జనుల సమ్మె దెబ్బ మంగళవారం తగిలింది. తెలంగాణ ప్రాంతంలోని సమ్మె ప్రభావం కారణంగా రఘువీరా రెడ్డి చాలాసేపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విషయానికి వస్తే సకల జనుల సమ్మె కారణంగా తెలంగాణలోని ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి స్థానికంగా ఉన్న పరిస్థితులు, తీసుకున్న చర్యలు తదితర అంశాలపై మాట్లాడుదామనుకున్నారు. అయితే రఘువీరా రెడ్డి ఎంతగా ప్రయత్నించినప్పటికీ జిల్లాలోని కలెక్టర్లు లైన్లోకి రాలేదు. పలుమార్లు వీడియో కాన్ఫరెన్సు ద్వారా మాట్లాడుదామని ప్రయత్నించినప్పటికీ చాలా సేపు కలెక్టర్లు లైన్లోకి రాలేదు. కలెక్టర్ల కోసం రఘువీరా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చాలాసేపటి తర్వాత పలువురు కలెక్టర్లు లైన్లోకి వచ్చారట. అయితే రఘువీరా నిరీక్షణ వెనుక ఉద్యోగుల సమ్మెతో పాటు అధికారుల నిర్లిప్తత కూడా ఉందని తెలుస్తోంది. కాగా సచివాలయంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు నిరసనకు దిగారు. సకల జనుల సమ్మెకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ హైదరాబాదులో శాంతి ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే లక్ష్మణ్ పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పలు పాఠశాలలు, సినిమా హాళ్లు స్వచ్చంధంగా బంద్‌లో పాల్గొన్నారు.

English summary
Minister Raghuveera Reddy effected with Sakala janula Samme today. Telangana collectors were not on line in his video conference for long time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X