సూర్య దిన పత్రిక అధినేత నూకారపు అరెస్టు

అయితే రెండు, మూడు రోజులుగా నూకారపు వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించిన కేసు వ్యవహారంలో సిబిఐ ముందు హాజరవుతున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం బాగానే ఉందని సిబిఐ అధికారులు ఆయనను అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా సరూర్ నగర్‌లోని నాదర్ గూల్ ప్రాంతంలో జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన పొట్లూరి వర ప్రసాద్ నుండి సుమారు 600 ఎకరాల భూమి కొన్న కేసులో ఆయన సిబిఐ ముందు రెండు రోజులుగా హాజరవుతున్నారు. కాగా అనంతపురం జిల్లాలోని విజయ బ్యాంకును మోసం చేశారనే అభియోగంలో నూకారపు సూర్య ప్రకాశ్ రావు ఐదో ముద్దాయిగా ఉన్నాడు. నూకారపు సూర్యప్రకాశ్ రావును నాంపల్లి కోర్టు 25 వేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేసింది. రేపు గురువారం ఉదయం పదిన్నర గంటలకు తమ ముందు హాజరు కావాలని న్యాయమూర్తి ఆయనను ఆదేశించారు.












Click it and Unblock the Notifications