ఇద్దరు కానిస్టేబుల్స్ భార్యలతో అధికారి రాసలీలలు

ఇటీవల బెజవాడ ఆలయ అనుబంధ అతిథి గృహం దగ్గర ఓ వ్యక్తి తుపాకీతో తిరుగుతున్నట్లు అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేశారట. సిఐ ఓ పోలీసును పంపారు. అతిథి గృహంలోకి వెళ్లి తలుపును తట్టడంతో సదరు ఉన్నతాధికారి ఇద్దరు బురఖా వేసుకున్న మహిళలతో కనిపించాడంట. అయితే వారిలో ఒకరు నా భార్య, మరొకరి సోదరి అని చెప్పడంతో పోలీసు వెళ్లిపోయాడు. ఆ తర్వాత రోజు కూడా అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి బురఖా ధరించిన వారు భార్య, సోదరి కాదని చెప్పడంతో సిఐ పోలీసులను పంపించారట. అయితే తాను ప్రత్యేక విభాగం అధికారినని చెప్పి ఐడి కార్డు చూపించడంతో పోలీసు వచ్చి సిఐకి జరిగిన విషయాన్ని చెప్పారు.
అయితే ఆ ఇద్దరు మహిళలు కానిస్టెబుల్స్ భార్యలుగా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సిఐ ఎస్పీఎఫ్ అధికారులకు చెప్పారు. సదరు ఉన్నతాధికారిపై ఎస్పీఎఫ్ డిజి విచారణకు ఆదేశించారని తెలుస్తోంది. ఆ ఉన్నతాధికారిపై గతంలోనూ చాలా ఆరోపణలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కానిస్టేబుల్స్‌ను బెదిరించే వాడనే ఆరోపణలు ఉన్నాయట.












Click it and Unblock the Notifications