రెండో రోజు తెలంగాణ సమ్మె, సినిమా హాళ్లు మూత

హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు ర్యాలీ చేపట్టారు. విద్యుత్ సౌధ ఎదుట ఉద్యోగులు మహాధర్నా చేశారు. సమ్మెకు మద్దతుగా నేడు, రేపు థియేటర్లు బంద్ పాటిస్తున్నాయి. మరోవైపు సింగరేణిలోనూ రెండో రోజు సకల జనుల సమ్మె కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం వచ్చేంతవరకు సమ్మెను కొనసాగిస్తామని సచివాలయం జెఎసి ప్రకటించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 160 సినిమా హాళ్ళు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. కరీంనగర్ జిల్లా రామగుండం రీజియన్‌లో రెండో రోజు సమ్మె కొనసాగుతోంది. ఎమర్జెన్సీ కార్మికులు మినహా మిగతా కార్మికులు గనుల వైపు చూడటం లేదు.


Click it and Unblock the Notifications