గాలితో నాకు ఎలాంటి సంబంధం లేదు: రాజగోపాల్

కాగా బుధవారం రాజగోపాల్ ఇంట్లో సోదాలు నిర్వహించిన సిబిఐ అధికారులు వరుసగా రెండో రోజు కూడా సోదాలు చేస్తున్నారు. సుమారు ఐదు గంటల పాటు సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆయన ఇంట్లో సాయంత్రం నుండి రాత్రి పదిగంటల వరకు సోదాలు నిర్వహించారు. గాలి జనార్ధన్ రెడ్డికి సహకరించిన వైనంపై ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మరికొందరు అధికారులు శ్రీలక్ష్మి, జయకుమార్ ఇళ్లలోనూ సోదాలు చేసినట్లుగా తెలుస్తోంది. కాగా గురువారం కూడా ఎమ్మార్, వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో మరికొందరు సిబిఐ అధికారుల ముందు హాజరవనున్నారు.












Click it and Unblock the Notifications