పదో తరగతి చదువుతున్న స్నేహితురాళ్ల ఆత్మహత్య!

Srikakulam District
శ్రీకాకుళం/మహబూబ్ నగర్: శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం కుత్తూరు గ్రామంలో పదవ తరగతి చదపుతున్న ముగ్గురు స్నేహితురాళ్లు మృతి చెందిన సంఘటన స్థానికంగా పెద్ద విషాదాన్ని నింపింది. ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న వినీత, శిరీష, సంధ్య అనే ముగ్గురు విద్యార్థినుల మృతదేహాలు గురువారం రోజు సముద్ర తీరానికి కొట్టుకొచ్చాయి. వీరు ముగ్గురు బుధవారం అదృశ్యమయ్యారు. అయితే రాత్రి వరకు తమ కూతుళ్లు ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే గురువారం ఉదయం రామయ్యపట్నం తీరప్రాంతంలో ఈ ముగ్గురు అమ్మాయిల చెప్పులు కనిపించాయి. ఆ తర్వాత ముగ్గురమ్మాయిల మృతదేహాలు కనిపించాయి.

తమకు పరీక్షలలో మార్కులు తక్కువగా వచ్చినందుకు వీరు చాలా బాధపడినట్లుగా తెలుస్తోంది. అయితే వీరు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. వారిని చూస్తే ఆత్మహత్యగానే కనిపిస్తోన్నప్పటికీ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో కారణాలు తెలియరాలేదు. కాగా మహబూబ్ నగర్ జిల్లాలో ఓ కసాయి తండ్రి నెల రోజుల బాలుడికి విషమిచ్చి చంపిన సంఘటన చోటు చేసుకుంది. బాలుడిని తండ్రే చంపాడని తెలిసిన గ్రామస్తులు నిందితుడిని చితకబాదారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+