అంబటి రాసలీలలు, ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి సంచలనం

పగలు నీతులు చెబుతూ రాత్రి పూట రాసలీలలు చేస్తాడని చెప్పింది. అంబటి రాంబాబు ఓ మహిళతో ఫోన్‌లో చేసిన సెక్సీ సంభాషణను ఎబిఎన్ ప్రసారం చేసింది. తమ వద్ద రాసలీలల దృశ్యాలున్నాయని ఎబిఎన్ - ఆంధ్రజ్యోతి చెబుకుంటుంది. ఆ సంభాషణను తప్ప ఇతర దృశ్యాలను ప్రసారం చేయలేదు.
ఆడవాళ్లంటే వెర్రెత్తి పోతాడని, అందలం ఆశ చూపి ఉచ్చు బిగిస్తాడని ప్రసారం చేసింది. అయితే బాధితుల ఫిర్యాదు మేరకే తాము ఫిర్యాదు చేశామని కానీ బాధితురాలి విజ్ఞప్తి మేరకు ఆమె పేరును చెప్పలేదని చెప్పారు. తన వద్దకు వచ్చే అమ్మాయిలకు ప్రత్యేకంగా డ్రెస్ కోడ్ పెడతారట. జగన్ ఓదార్పు యాత్రలో, దీక్షలలోనూ అంబటి రాంబాబు డ్రెస్ కోడ్ పెడతారట. ఓ వైపు రాజకీయం మరోవైపు రాజకీయాలను అడ్డు పెట్టుకొని మాయమాటలతో, బెదిరింపులతో లొంగదీసుకోవడం అంబటి రాంబాబు స్టైల్ అని చెప్పారు. పార్టీ అధినేతను కలుపుతాననే మాటలు చెప్పి తన వికారాలు తీర్చుకుంటారని చెప్పారు.
కాగా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తన రాసలీలల కార్యక్రమం ప్రసారం చేస్తుండగా అంబటి రాంబాబు రాష్ట్రవ్యాప్తంగా పలువురు కేబుల్ ఆపరేటర్ల పైన కేబుల్ ప్రసారాలు నిలిపి వేయాలని ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా ఆ టీవీ ఛానల్ స్ర్కోలింగ్ ఇచ్చింది. గుంటూరు జిల్లాతో పాటు ఖమ్మం, హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో కేబుల్ ప్రసారాలు నిలిపి వేయాలని అంబటి రాంబాబు ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పింది.












Click it and Unblock the Notifications