అంబటి రాసలీలల కథనం: వైయస్ జగన్‌కు చిక్కులు

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాసలీలల కథనంతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చిక్కుల్లో పడినట్లే. అంబటి రాంబాబుపై పార్టీపరంగా చర్యలు తీసుకోవాలని వైయస్ జగన్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అన్ని రాజకీయ పార్టీల నాయకులు అంబటి వ్యవహారంపై మండిపడుతున్నాయి. అంబటి రాంబాబు రాసలీలలపై ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారం చేసిన వార్తాకథనం తీవ్ర సంచలనం సృష్టించింది. తన వద్దకు రావాలని అంబటి రాంబాబు మహిళా నేతలను వేధిస్తున్నాడని ఆ చానెల్ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. ఓ మహిళతో అంబటి రాంబాబు తన ఇంటికి రావాలని, ఇంట్లో ఎవరూ లేరని ఫోన్‌లో మాట్లాడిన సంభాషణను కూడా చానెల్ ప్రసారం చేసింది.

అంబటి రాంబాబుపై వైయస్ జగన్‌కు కొంత మంది అప్పటికే ఫిర్యాదు చేశారని అంటున్నారు. అయితే, జగన్ ఆ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారనేది తెలియదు. కానీ, అంబటి రాంబాబును వైయస్ జగన్ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ సెంట్రల్ గవర్నెన్స్ కౌన్సిల్‌లోకి తీసుకోలేదు. కీలక నిర్ణయాలకు ఆయనను దూరంగా పెట్టినట్లు కూడా తెలుస్తోంది. అయితే, దీనికి కారణం మాత్రం తెలియదు. దాంతో అప్పట్లో అంబటి రాంబాబు అలిగారు కూడా. కానీ జగన్ తన నిర్ణయం మార్చుకోలేదు. ఇప్పుడు వైయస్ జగన్‌ అంబటి రాంబాబుపై కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అనివార్యతలో పడ్డారని అంటున్నారు. అంబటి రాంబాబు వ్యవహారంపై జగన్ శుక్రవారం ఉదయం మాజీ పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో చర్చించినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+