బాబు ఇంట్లో నారా బ్రాహ్మణిని విచారించిన సిబిఐ

సిబిఐ అధికారులు బ్రాహ్మణి వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. నారా బ్రాహ్మణి పేరు మీద ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో రెండు విల్లాలు ఉన్నాయి. వాటిని తన కుమారుడు నారా లోకేష్‌ను పెళ్లి చేసుకోక ముందు బాలకృష్ణ కొనుగోలు చేసి బ్రాహ్మణికి ఇచ్చారని చంద్రబాబు గతంలో చెప్పారు. చంద్రబాబు ఇంటికి వచ్చిన సిబిఐ అధికారులు మీడియా ప్రతినిధుల కంట పడకుండా సిబిఐ అధికారులు వెళ్లిపోయారు. అక్కడ ఉన్న ఓ తెలుగుదేశం నాయకుడు మీడియా ప్రతినిధులతో ముచ్చట్లు పెడుతూ మీడియా కళ్లు సిబిఐ అధికారుల మీదికి వెళ్లకుండా జాగ్రత్త పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications