బాలయ్య పోటీపై తెలంగాణ టిడిపి భిన్నస్వరాలు

రెండు రోజుల క్రితం టిడిపి సీనియర్ శాసనసభ్యుడు జైపాల్ యాదవ్ మాట్లాడుతూ తాము ప్రస్తుతం బాలయ్య కోసం రాజీనామా చేసి ఆహ్వానించే స్థితిలో లేమని చెప్పారు. అయితే ఇదే తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, కొత్తకోట దయాకర్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా గురువారం స్పందించారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ తెలంగాణ బిడ్డలే అని, వారు తెలంగాణ ప్రాంతంలో పోటీ చేస్తానంటే స్వాగతిస్తామని ఎర్రబెల్లి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యే కొత్తకోట మరో అడుగు ముందుకేసి బాలయ్య పోటీ చేస్తానంటే తాను గాని, తన భార్య గాని నియోజకవర్గాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎన్టీఆర్, చంద్రబాబు, బాలయ్యలను ఓ ప్రాంతానికి చెందిన వారుగా చూడవద్దని కోరారు.












Click it and Unblock the Notifications