అంబటి రాంబాబును జగన్ సమర్థిస్తున్నారా?

తప్పు చేసి ఉంటే చర్యలు తీసుకుంటామని మాత్రం వైయస్సార్ కాంగ్రెసు మహిళా విభాగం నేత నిర్మలాదేవి అంటున్నారు. కానీ, సాక్షి టీవీ చానెల్‌లో మంజు అనే అమ్మాయితో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, రిపోర్టర్ క్రాంతిపై ఎదురు దాడి చేయించారు. అంబటి రాంబాబుతో తాను ఇప్పటి వరకు మాట్లాడలేదని, ఆయనను చూడలేదని ఆమె చెప్పింది. రిపోర్టర్ క్రాంతి తనను బెదిరించి, ఒత్తిడి పెట్టి చానెల్ కార్యాలయానికి తీసుకుని వెళ్లి అక్కడ కూర్చోబెట్టి తనతో మాట్లాడించారని మంజు చెబుతోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్‌లో తెరచాటున ఉండి మాట్లాడింది తానే అని అంగీకరించింది.
కాగా, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై, రిపోర్టర్ క్రాంతిపై మంజు కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసినట్లు సాక్షి టీవీ చానెల్ ఓ వార్తను ప్రసారం చేసింది. అంబటి రాంబాబు కూడా ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఏమైనా, జగన్ సూచన మేరకు ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై ఎదురుదాడికి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థను జగన్ ప్రత్యర్థిగానే చూస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే.












Click it and Unblock the Notifications