టిఎన్జీవో నేత స్వామిగౌడ్ అరెస్టు, బెయిల్‌పై విడుదల

Swamy Goud
హైదరాబాద్: సకల జనుల సమ్మెలో భాగంగా హైదరాబాదులోని మహాత్మా గాంధీ హాస్పిటల్‌లో జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలపడానికి వచ్చిన టిఎన్జీవో నేత స్వామి గౌడ్‌ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను చిలకలగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయనను బెయిలుపై విడుదల చేశారు. స్వామిగౌడ్‌ను ప్రివెన్షన్ యాక్టు కింద అరెస్టు చేశామని అనంతరం బెయిలుపై విడుదల చేశామని నగర సిపి ఎకె ఖాన్ తెలిపారు. కాగా అంతకుముందు తనను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆయన పోలీసులను డిమాండ్ చేశారు. పలువురు టిఎన్జీవో నేతలు సైతం చిలకలగూడ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి అరెస్టుకు కారణం చెప్పాలని ఆందోళన నిర్వహించారు. గత నాలుగు రోజులుగా తాము శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నామని అలాంటప్పుడు స్వామిగౌడ్‌ను అరెస్టు ఎందుకు చేశారని ప్రశ్నించారు.

కాగా స్వామి గౌడ్ అరెస్టును తెలంగాణ వ్యాప్తంగా అందరూ ఖండించారు. స్వామి గౌడ్‌ను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. అరెస్టు అప్రజాస్వామికమన్నారు. అరెస్టు విషయం తెలిసిన కెసిఆర్ పోరు తెలంగాణ చిత్రం మధ్యలోనే బయటకు వచ్చారు. విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. స్వామిగౌడ్‌ను విడుదల చేయకపోతే అత్యవసర సేవలు నిలిపి వేస్తామని టిఎన్జీవో నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+