జగన్‌పై పోరు నచ్చలేదేమో?: సిఎంపై శంకరరావు ఫైర్

మంత్రివర్గం నుండి తప్పుకునే యోచనలో ఉన్నట్టు చెప్పారు. అధిష్టానానికి చెప్పి మంత్రివర్గం నుండి తప్పుకుంటానన్నారు. తనకు పలుమార్లు బెదిరింపు ఫోన్లు వచ్చాయని ముఖ్యమంత్రి ఇప్పటికైనా తనకు రక్షణ కల్పించాలని కోరారు. బెదిరింపు కాల్సుకు ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని ఆరోపించారు. ఇతర మంత్రుల ముందు సిఎం నన్ను అవమానిస్తున్నారని ఆరోపించారు. తన ఆదేశాలు పట్టించుకోవద్దని అధికారులకు చెబుతున్నారన్నారు. కాంగ్రెసుకు నష్టం చేస్తున్న వారిపై పోరాటం చేస్తే నన్ను అవమానించడం శోచనీయమన్నారు.












Click it and Unblock the Notifications