మళ్లీ తెలంగాణ కాంగ్రెసు రాజీనామాస్త్రాలు

K Keshav Rao
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు మళ్లీ రాజీనామాస్త్రాలు సంధించాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం జరిగిన కాంగ్రెసు తెలంగాణ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరులో తెలంగాణ అనుకూలంగా తమ పార్టీ అధిష్టానం స్పష్టమైన ప్రకటన చేయకపోతే వచ్చే నెల 2వ తేదీ నుంచి విడతలవారీగా రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నారు. జిల్లాలవారీగా రాజీనామా పత్రాలను సేకరించే బాధ్యతను ఆయా జిల్లాల నాయకులకు అప్పగించారు. తమ రాజీనామా లేఖలను వారు పార్టీ అధిష్టానానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు

ఈ నెల 19వ తేదీన రాజ్యసభ సభ్యుడు కె. కేశవ రావు, మంత్రి కె. జానా రెడ్డి ఢిల్లీకి వెళ్లి పార్టీ అధిష్టానం పెద్దలను కలుస్తారు. సకల జనుల సమ్మెకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందని సమావేశానంతరం పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎన్జీవోల నాయకుడు స్వామి గౌడ్ అరెస్టును ఆయన ఖండించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలనుకుంటే ప్రభుత్వ మనుగడ కష్టమని ఆయన అన్నారు. సీమాంధ్ర మంత్రులు టిజి వెంకటేష్, శైలజానాథ్ తెలంగాణ ప్రజలను అవహేళన చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రానికి వాస్తవాలు తెలియజేయాలని ఆయన కోరారు. బాన్సువాడ ఉప ఎన్నికలో కాంగ్రెసు పార్టీకి డిపాజిట్ దక్కకపోతే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

తెలంగాణ శాసనసభ్యులు చేసిన రాజీనామాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తెలంగాణ పార్లమెంటు సభ్యుల రాజీనామాలు మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి. రాజీనామాలను తిరస్కరించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ నగారా శాసనసభ్యులు మళ్లీ రాజీనామాలు చేశారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల శానససభ్యులు మళ్లీ రాజీనామాలు చేయలేదు. తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు విధులకు హాజరవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+