జగన్‌కు మరో షాక్, కిరణ్ కుమార్ వెంట ఎమ్మెల్యేలు

YS Jagan
ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు పశ్చిమ గోదావరి జిల్లా శాసనసభ్యులు కొంత మంది షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా పర్యటనలో జగన్ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గురువారం భీమడోలు మండలం పూళ్ళలో జరిగిన సభలో పాల్గొన్న సీఎం స్త్రీ నిధి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఆ తర్వాత ఏలూరులో జెడ్పీ సమావేశ మందిరం ప్రారంభోత్సవం, కలెక్టరేట్‌లో శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో జగన్ వర్గానికి చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ నాని పాలుపంచుకున్నారు. జడ్పీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి - ఎమ్మెల్యే నాని భుజం తట్టి 'ఎలా ఉన్నావు' అంటూ కుశల ప్రశ్నలు కూడా వేశారు.

ఎమ్మెల్యే మారుమాట్లాడకుండా కార్యక్రమాల్లో సీఎం వెంటే ఉంటూ, ఆయన వాహనంలోనే ప్రయాణించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అనంతరం సీఎం ఎస్పీ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో భేటీ అయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి నానితో పాటు, జగన్ వర్గానికి చెందిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు కూడా హాజరయ్యారు. తమ నియోజకవర్గాల్లో సమస్యలను ఏకరువు పెట్టారు. వారి మాటలను ముఖ్యమంత్రి ఓపిగ్గా విన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+