అంబటి రాసలీలలు: ఈమె ఆమేనని అంగీకారం

ఆంధ్రజ్యోతి మంజుపై ఈ విధంగా వ్యాఖ్యానించింది - అంబటి రాసిచ్చిన అబద్ధాల స్క్రిప్టు ప్రకారం నడుచుకుంది. కానీ.. అంబటి ఆడించిన ఈ నాటకం ఏమాత్రం రక్తి కట్టించలేకపోయింది. ఆ యువతి పేరు మంజుల! బిత్తర చూపులు, తడబడే మాటలు, తడారుతున్న గొంతు, మీడియా ప్రశ్నలకు నీళ్లు నమలడం... మంజుల అబద్ధం చెబుతోందనడానికి ఇవి చాలు.
ఎబిఎన్ తనను బయటకు లాగిందని అంటున్న మంజు తనంత తానే బయటపడిందని ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానించింది. మీడియా విలువలకు కట్టుబడి మంజుల పేరు గానీ, ఆమె ముఖాన్ని గానీ తాము చూపించలేదని ఆంధ్రజ్యోతి వివరణ ఇచ్చింది. అంబటి రాంబాబే ఆమె చేత ఆంధ్రజ్యోతి ఎండీ, సిబ్బందిపై కేపీహెచ్‌బీ కాలనీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేయించారని ఆరోపించింది.












Click it and Unblock the Notifications