షూ ట్రేడర్ పేరు మీద అజర్ తనయుడి సూపర్ బైక్

ఆ పత్రిక కథనం ప్రకారం - ఆ బైక్‌ను హైదరాబాదులోని మల్లేపల్లిలో గల ఫజల్ సాగర్‌కు చెందిన సయ్యద్ అథేర్ 2010 డిసెంబర్ 23వ తేదీన 13 లక్షల 12 వేల 649 రూపాయలకు కొనుగోలు చేశాడు. అయితే, బైక్ డీలర్ నుంచి వాస్తవానికి ఆజర్ ఆ బైక్‌ను కొన్నాడని చెబుతున్నారు. యాజమాన్య పత్రాలను పరిశీలించడానికి పోలీసులు శుక్రవారం అథేర్ అలీ ఇచ్చిన చిరునామాకు వెళ్లారు. అయితే, అతను ఇంట్లో లేడు. శుక్రవారం ఉదయం ఆయాజుద్దీన్ జన్‌ఝాలో పాల్గొనడానికి మక్కా మసీదుకు వెళ్లాడని తెలిసింది.
మక్కా మసీదుకు వెళ్లిన పోలీసులు ఆ బైక్ అథేర్ అలీదని తేల్చుకున్నారు. ధ్రువపత్రాలను శనివారం అందజేస్తానని అతను పోలీసులకు చెప్పాడు. తాను కాన్పూర్‌కు చెందినవాడినని, అజర్ కుటుంబ స్నేహితుడినని అతను చెప్పాడు. తాను ఆఘాపూరలో నోబుల్ ఫుట్‌వియర్ దుకాణం నడుపుతున్నట్లు కూడా అతను తెలిపాడు.












Click it and Unblock the Notifications