బొత్సపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు: కె కేశవరావు వివరణ

సకల జనుల సమ్మె వద్దనే వారు ముందుకు వచ్చి తెలంగాణ ఇప్పిస్తే మంచిదని ఆయన సూచించారు. సమ్మె వల్ల ఇబ్బందులు పడే ఉద్యోగులను మేం ఆదుకుంటామని ప్రకటించారు. ఎస్మా పేరుతో ఉద్యోగులను ప్రభుత్వం రెచ్చగొట్టవద్దని కోరారు. సమ్మెకు తెలంగాణ కాంగ్రెసు మద్దతు ఉంటుందన్నారు. సమ్మెలతో సాధించలేమని అనుకోవడం పొరపాటన్నారు. సమ్మెల ద్వారా ఎన్నో సాధించారన్నారు. ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం అణిచి వేయాలని చూస్తే ప్రజాస్వామ్యాన్ని అర్థం చేసుకోలేక పోవడమే అన్నారు.












Click it and Unblock the Notifications