శామ్‌పిట్రోడా, మూర్తి ఆధ్వర్యంలో 'రీసర్జెంట్ బెంగాల్'

వామపక్షం ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీరంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఐటీ శాఖ మంత్రి ఆరోపించారు. ప్రపంచస్థాయి ఐటీ మౌలిక సదుపాయాలను ఈ రంగంలోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. తమ ప్రభుత్వం దేశంలోనే ఐటీ రంగంలో అగ్ర స్థానంలో ఉండేందుకు కృషి చేస్తుందన్నారు. రాష్ట్రప్రభుత్వం హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ రంగాలను అభివృద్ధి చేస్తుందని దీనికి కోర్ గ్రూపు సూచనలు సలహాలు ఇస్తుందన్నారు. ఈ ప్రాజెక్టును 'రీసర్జెంట్ బెంగాల్' అని నామకరణం చేశామని చెప్పారు. ఈ కమిటీ మీటింగ్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. నాస్కామ్ చీఫ్ కిరణ్ కార్నిక్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications